Sunday, 29 December 2013

Uyyalaina Jampalaina - Uyyala Jampala(ఉయ్యాల జంపాల)



ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ

మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఒ పూల మాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఉగాలిలా
ఒహో… నీవేగా నాలో నా గుండెలో శృతి లయా
ఒహో… నీవేగా నాకు నా ఊహలో సఖి ప్రియ

చెయ్యే చాస్తే ఆందేటంత దెగ్గెర్లో ఉంది
చందమామ నీలా మారి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలోకొక్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది
కాలాన్నీలా ఆపే బలం ఇద్డర్‌లో ఉంది
రేపంటు మాపంటు లేనే లేని లోకంలో ఇద్దరినే ఉహించని
ఎటు వైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొక్చేదెలా
ఓహో... నా జానకల్లె ఉండాలిగా నువ్వే ఇలా
ఓహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ మూడే
ఒహో… ఎన్నాళ్లగానో నా కళ్ళలో కనే కల
ఒహో… ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాల
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేల నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చేరి నిజం నిజం


Movie Name : Uyyala Jampala
Cast : Raj Tarun, Avika Gor
Director : Virinchi Varma
Producer : P. Ram Mohan
Music Director : Sunny M.R
Singer : Harshika Gudi, Anudeep Dev
Lyricist: Vasu Valaboju

No comments:

Post a Comment