Saturday, 22 December 2012

Yemito - Andaala Rakshasi


శపించనె నన్ను నా గతం 
ఆలస్యమైందని తనకు నీ పరిచయం 
నువ్వేనట ఇకపై నా జీవితం 
శాపమైనా వరంలా తోచెలె ఈ క్షణం 

ఏమిటో ఇవ్వాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశం అంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వె మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే ...కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే ...

ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఒ కాలమా నువ్వే 
ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఒ దూరమా ...
నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల 
పొందుతున్న హాయి ముందు ఓడిపో
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి ...తడిసింది లే నాలో ప్రాణమే
ఈ బాధకే  ప్రేమన్న మాట తక్కువైన్దిగా ...

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిష్వాసలా ... నీకే
న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా ...
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా ...
కలలతోనే కాలయాపన నిజాలజాడ నీవే అంటు మెలకువై కలె చూపె 
ఏం మార్పిది నిమీద ప్రేమ పుట్టుకోచ్చె ...ఏం చేయ్యను నువ్వే చెప్పవా 
ఈ బాధకె ప్రేమన్న మాట తక్కువైంది గా 

ఏమిటో ఇవ్వాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశం అంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వె మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే ...కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే ...
చిత్రం: అందాల రాక్షసి
గాయకుడు:  హరిచరణ్ 
రచయిత: రాకేందు మౌళి 

No comments:

Post a Comment