Saturday, 12 September 2020


సంతతమహం కుంజర ముఖం 

శంకర సుతం - తమిహ 

శ్రీ విజ్ఞరాజం భజే 


సంతతమహం దంతి, సుందర ముఖం 

అంత కాంతక సుతం - తమిహ

శ్రీ విజ్ఞరాజం భజే 


శ్రీ విజ్ఞరాజం భజే  

శ్రీ విజ్ఞరాజం భజేహం భజేహం భజేహం భజే - తమిహ 

శ్రీ విజ్ఞరాజం భజే   


చరణం 1:


సేవిత సురేంద్ర మహనీయ గుణశీలం 

జపతప సమాధి సుఖ వరదానుకూలం 

భావిత సురమణి ఘన భక్త పరిపాలం 

భయంకర విషంగ మాతంగ కుల కాలం 


చరణం 2:


కనక కేయూర హారావళీ కలిత 

గంభీర గౌరగిరి శోభం సుశోభం 

కామాధి భయ భరిత మూఢమధ 

కలి కలుష కంఠితమఖండ ప్రతాపం - ప్రతాపం 

సనక సుఖ నారద పతంజలి పరాశర 

మతంగ ముని సంగ సల్లాపం - సల్లాపం 

సత్య పరమాబ్జ నయన ప్రముద ముక్తికర 

తత్వమసి నిత్య నిగమాధి స్వరూపం 


సంతతమహం కుంజర ముఖం 

శంకర సుతం - తమిహ 

శ్రీ విజ్ఞరాజం భజే 

Friday, 14 October 2016

నీవే Neeve 2016 - Telugu Song Lyrics



నీవే... 

తొలి ప్రణయము నీవే 
తెలి మనసున నీవే 
ప్రేమ ఝల్లువే 
నీవే... నీవే

కలలు మొదలు నీవల్లే 
మనసు కడలి అలలు నీవల్లే 
కనులు తడుపు నీవే
కలత చెరుపు నీవే
చివరి మలుపు నీవే

నీవే... 
యెటు కదలిన నీవే
నను వదిలిన నీవే
ఎదో మాయవే 
ఆఁ  ప్రేమే... 
మది వెతికిన నీడే 
మనసడిగిన తోడే 
నా జీవమే 

నిలువనీదు క్షణమైనా 
వదలనన్న నీ ధ్యాసా 
కలహమైన సుఖమల్లే 
మారుతున్న సంబరం 

ఒకరికొకరు యెదురైతే 
నిమిషమైన యుగమేగా 
ఒక్కోసారి కనుమరుగై 
ఆపకింక ఊపిరీ 

నీవే... 
గడిచిన కథ నీవే
నడిపిన విధి నీవే
నా ప్రాణమే 
ఆఁ పాదం 
వెతికిన ప్రతి తీరం 
తెలిపిన శశి దీపం 
నీ స్నేహమే 

నీ జతే విడిచే 
ఊహనే తాళనులే 
వేరొకా జగమే 
నేనికా ఎరుగనులే 

గుండెలోని లయ నీవే
నాట్యమాడు శృతి నేనే 
నువ్వు నేను మనమైతే 
అదో కావ్యమే 

నీవే
నను గెలిచిన సైన్యం 
నను వెతికిన గమ్యం 
నీవే నా వరం 
ఆఁ ప్రేమే 
తొలి కదలికలోనే 
మనసులు ముడి వేసే 
ఇదో సాగరం  
   

Song-Neeve
Music-Phani Kalyan
Singer(s)-Yazin Nizar, Sameera Bharadwaj
Lyrics-SreeJo






Sunday, 29 December 2013

Aadinchi Ashta Chamma - Ashta Chamma (అష్ట చెమ్మ)


ఆడించి అష్ట చెమ్మ ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్ట చెమ్మ ఓడించవమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మ
ఘోరంగా నింధస్తూ ఈ పంతలెందుకు చాల్లే మంగమ్మ
చూసాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకోను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్డన్న నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో
నీదాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజమ్మ
మందారం అయ్యింది ఆ రోషం తాకి జల్లో జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్నదాకా
ముళ్లంటి కోపం ఒళ్లంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా
మరీ ఈ మారాం మానమ్మ
ఈ లావాదేవి లేమి అంత కొత్తెం కాదమ్మా 

Movie Name : Ashta Chamma
Music by : Kalyani Malik
Lyrics : Sirivennela
Singer : Sri krishna

Uyyalaina Jampalaina - Uyyala Jampala(ఉయ్యాల జంపాల)



ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ

మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఒ పూల మాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఉగాలిలా
ఒహో… నీవేగా నాలో నా గుండెలో శృతి లయా
ఒహో… నీవేగా నాకు నా ఊహలో సఖి ప్రియ

చెయ్యే చాస్తే ఆందేటంత దెగ్గెర్లో ఉంది
చందమామ నీలా మారి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలోకొక్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది
కాలాన్నీలా ఆపే బలం ఇద్డర్‌లో ఉంది
రేపంటు మాపంటు లేనే లేని లోకంలో ఇద్దరినే ఉహించని
ఎటు వైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొక్చేదెలా
ఓహో... నా జానకల్లె ఉండాలిగా నువ్వే ఇలా
ఓహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ మూడే
ఒహో… ఎన్నాళ్లగానో నా కళ్ళలో కనే కల
ఒహో… ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాల
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేల నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చేరి నిజం నిజం


Movie Name : Uyyala Jampala
Cast : Raj Tarun, Avika Gor
Director : Virinchi Varma

Saturday, 22 December 2012

Yemito - Andaala Rakshasi


శపించనె నన్ను నా గతం 
ఆలస్యమైందని తనకు నీ పరిచయం 
నువ్వేనట ఇకపై నా జీవితం 
శాపమైనా వరంలా తోచెలె ఈ క్షణం 

ఏమిటో ఇవ్వాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశం అంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వె మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే ...కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే ...

ఆగని ప్రయాణమై యుగాలుగా సాగిన ఒ కాలమా నువ్వే 
ఆగుమా తనే నా చెంతనుండగా తరమకే ఒ దూరమా ...
నువ్వేలేని నేను నేనుగా లేనే లేనుగా
లోకాన్నే జయించినా నీ ప్రేమ వల్ల 
పొందుతున్న హాయి ముందు ఓడిపో
జారిందిలే జల్లంటు వాన చినుకు తాకి ...తడిసింది లే నాలో ప్రాణమే
ఈ బాధకే  ప్రేమన్న మాట తక్కువైన్దిగా ...

గుండెలో చేరావుగా ఉచ్వాసలాగా మారకే నిష్వాసలా ... నీకే
న్యాయమా నన్నే మార్చి ఎరుగనంతగా నువ్వలా ఉన్నావెలా ...
నిన్నల్లోనే నిండిపోకలా నిజంలోకి రా ...
కలలతోనే కాలయాపన నిజాలజాడ నీవే అంటు మెలకువై కలె చూపె 
ఏం మార్పిది నిమీద ప్రేమ పుట్టుకోచ్చె ...ఏం చేయ్యను నువ్వే చెప్పవా 
ఈ బాధకె ప్రేమన్న మాట తక్కువైంది గా 

ఏమిటో ఇవ్వాళ రెక్కలోచినట్టు
వింతగా ఆకాశం అంచు తాకుతున్న
గుండెనే కొరుక్కుతిన్న కళ్ళు చూసినంతనే
మనస్సు నవ్వె మొదటిసారి
ఏం మార్పిది ఎడారి ఎండమావి ఉప్పెనై ముంచెనే ...కలే కాదుగా
నీవల్లనే భరించలేని తీపి బాధలే ...
చిత్రం: అందాల రాక్షసి
గాయకుడు:  హరిచరణ్ 
రచయిత: రాకేందు మౌళి 

Friday, 16 September 2011

Nallani vanni neellani - Chatrapati(2005)

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...
జరిగిన కథ విని ఈ కడలి నవ్వింది
మమతకే తగనని తొలిసారి తెలిసింది

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...

నీ కన్నులకావేరిని కడుపులోన దాచుకున్నా
అంతులేని కడలిలోతుని నేను చూస్తున్నా
కడుపులో నిన్ను మోయకున్నా
అమ్మ తప్పుని కడుపులోన దాచుకున్న నిన్ను చూస్తున్నా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా...అమ్మని ..నీ మీద నా ఒట్టు ...

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...

తప్పటడుగులు వేసిన తల్లిగా విసిరేసిన
ఈ దారితప్పిన తల్లిని వదిలేయకు
చచ్చిపుడత నాయన బిడ్డగా నీ కడుపునా
జరగనే జరగదు ఇకపైన పొరపాటు
నమ్మరా...అమ్మని ..నీ మీద నా ఒట్టు ...

నల్లనివన్నీ నీళ్ళని తెల్లనివన్నీ పాలని
అనుకున్నాగనుకే కుమిలిపోతున్నా...
నేను చేసిన తప్పు చెరిగిపోయేన...