Sunday, 29 December 2013

Aadinchi Ashta Chamma - Ashta Chamma (అష్ట చెమ్మ)


ఆడించి అష్ట చెమ్మ ఓడించావమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఆడించి అష్ట చెమ్మ ఓడించవమ్మా
నీ పంట పండిందే ప్రేమ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మ
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మ
ఘోరంగా నింధస్తూ ఈ పంతలెందుకు చాల్లే మంగమ్మ
చూసాక నిన్ను వేశాక కన్ను వెనక్కెలాగ తీసుకోను
ఎం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్డన్న నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో
నీదాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే ఇష్టంగా ఓడడం అంతే

నా నేరం ఏముందే ఎం చెప్పిందో నీ తల్లో జేజమ్మ
మందారం అయ్యింది ఆ రోషం తాకి జల్లో జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి కెవ్వంది గుండె నిన్నదాకా
ముళ్లంటి కోపం ఒళ్లంతా అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా
మరీ ఈ మారాం మానమ్మ
ఈ లావాదేవి లేమి అంత కొత్తెం కాదమ్మా 

Movie Name : Ashta Chamma
Music by : Kalyani Malik
Lyrics : Sirivennela
Singer : Sri krishna

Uyyalaina Jampalaina - Uyyala Jampala(ఉయ్యాల జంపాల)



ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ

మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
ఇదో రకం స్వయం వరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఒ పూల మాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఉగాలిలా
ఒహో… నీవేగా నాలో నా గుండెలో శృతి లయా
ఒహో… నీవేగా నాకు నా ఊహలో సఖి ప్రియ

చెయ్యే చాస్తే ఆందేటంత దెగ్గెర్లో ఉంది
చందమామ నీలా మారి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలోకొక్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతే పోనీ పోయేదేముంది
కాలాన్నీలా ఆపే బలం ఇద్డర్‌లో ఉంది
రేపంటు మాపంటు లేనే లేని లోకంలో ఇద్దరినే ఉహించని
ఎటు వైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతే రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొక్చేదెలా
ఓహో... నా జానకల్లె ఉండాలిగా నువ్వే ఇలా
ఓహో... వనవాసమైన నీ జంటలో సుఖం కదా

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మళ్ళీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ మూడే
ఒహో… ఎన్నాళ్లగానో నా కళ్ళలో కనే కల
ఒహో… ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయా

గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాల
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేల నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చేరి నిజం నిజం


Movie Name : Uyyala Jampala
Cast : Raj Tarun, Avika Gor
Director : Virinchi Varma